‘సంఘమిత్ర’ లో ఇంకా ఫైనల్ కాని హీరోయిన్ !

దర్శకుడు సుందర్.సి అత్యంత భారీ బడ్జెట్ తో ‘సంఘమిత్ర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పబడుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. హీరోయిన్ ప్రధానంగా నడిచే ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ శృతి హాసన్ అనుకున్నా ఆమె తప్పుకోవడంతో ‘లోఫర్’ ఫేమ్ దిశా పఠాని పేరు తెరపైకొచ్చింది.

ఆమెనే ఫైనల్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయట. దిశా పఠాని పేరు ఇంకా పరిశీలనలోనే ఉందట, ఫైనల్ చేయలేదట. మరి ఆమె అయినా ప్రాజెక్టులో కుదురుకుంటుందో లేదో చూడాలి. ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందివ్వనున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పనిచేయనున్నారు. నిర్మాణ సంస్థ శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ ఈ చిత్రం కోసం సుమారు రూ. 450 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయనుంది.