“హే సినామిక” ట్రైలర్‌ను విడుదల చేయనున్న సూపర్ స్టార్

Published on Feb 16, 2022 11:45 am IST

ప్రముఖ కొరియోగ్రాఫర్, బృందా గోపాల్, హే సినామిక అనే తమిళ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 4, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. దానికి ముందు ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మెగాస్టార్‌ మమ్ముట్టి విడుదల చేయనున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ లో అందాల నటీమణులు కాజల్ అగర్వాల్ మరియు అదితి రావ్ హైదరీ కథానాయికలు గా నటిస్తున్నారు. జియో స్టూడియోస్ మరియు గ్లోబల్ వన్ స్టూడియోస్ పతాకాల పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ తమిళ – తెలుగు చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :