మహా సముద్రం నుండి రేపు విడుదల కానున్న “హేయ్ తికమక మొదలే” లిరికల్ సాంగ్!

Published on Sep 29, 2021 8:02 pm IST


RX 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వం లో శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర ఈ చిత్రానికి సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల అయిన పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి మరొక లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది.

హేయ్ తికమక మొదలే అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకూ క్లాస్ అండ్ మాస్ సాంగ్స్ ఈ చిత్రం నుండి విడుదల కాగా, ఇప్పుడు ఇది డ్యూయెట్ సాంగ్ అంటూ చెప్పుకొచ్చింది. మహా సముద్రం చిత్రాన్ని ఈ అక్టోబర్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :