మరింత ఆసక్తికరంగా మహ సముద్రం… విడుదలైన “హేయ్ తికమక మొదలే” సాంగ్

Published on Sep 30, 2021 8:53 pm IST


శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. RX100 ఫేం దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు, వీడియో లు సినిమా పై ఆసక్తి పెంచేలా ఉన్నాయి.

ఈ చిత్రం నుండి తాజాగా హేయ్ తికమక మొదలే అంటూ ఒక పాటను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక ఈ పాట తమ ఫేవరేట్ అంటూ సిద్దార్థ్ తో పాటుగా పలువురు చెబుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :