‘హాయ్ నాన్న’ ఆల్బమ్ మీ మనసులు తాకుతుంది – హీరో నాని

Published on Sep 13, 2023 7:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ యక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ పై నాని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని అతి త్వరలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ఒక చిన్న వీడియో బైట్ రిలీజ్ ద్వారా ప్రకటించారు. తప్పకుండా హాయ్ నాన్న మ్యూజిక్ ఆల్బమ్ మీ అందరి మనసులు తాకుతుంది అంటూ హీరో నాచురల్ స్టార్ నాని పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ డిసెంబర్ 21న గ్రాండ్ గా ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :