“బిగ్ బాస్” షో పై కేసు..తేల్చేసిన హైకోర్టు.!

Published on Sep 21, 2023 7:10 am IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ వద్ద భారీ సక్సెస్ అయినటువంటి షోస్ లో అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ కూడా ఒకటి. మరి ఈ షో ఇప్పుడు ఏడవ సీసన్లోకి అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ ఉండగా ఈ షో విషయంలో అయితే గత కొన్నాళ్ల కితం ఓ పిటీషినర్ హై కోర్టు లో షో ని నిలిపివేయాలని పిటిషన్ వేశారట.

అయితే ఈ పిటిషన్ వేసినవారికి న్యాయస్థానం షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. పిటిషనర్ వేసిన ఈ కేసును డిస్పోజ్ చేసారని గతంలో కూడా పలు పిటిషన్ లు వేయగా వాటి తోనే వేసుకోవాలని సూచించారట. దీనితో అయితే షో విషయం లో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాలి. ఇక ఈ గ్రాండ్ రియాలిటీ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా స్టార్ మా ఈ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :