భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్న శర్వానంద్ !

29th, June 2017 - 03:49:31 PM


ఈ సంవత్సరం ‘శతమానంభవతి, రాధ’ వంటి సినిమాలతో మంచి విజయాలనందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కామెడీతో పాటు రొమాన్స్, యాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.

నగరంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శర్వానంద్ పై భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫర్ వెంకట్ నేతృత్వంలో వీటిని రూపొందిస్తున్నారు. ఇకపోతే శర్వానంద్ జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.