‘నేనే రాజు నేనే మంత్రి’ అనేది ఒక పెద్ద కథ – రానా
Published on Jul 18, 2017 12:29 pm IST


దగ్గుబాటి రానా నటించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రానా చేసిన చిత్రం కావడంతో పాటు రిలీజైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. జోగేంద్ర అనే పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ చాలా పెద్దదని, సుమారు 5 సంవత్సరాల కాలంలో జరుగుతుందని, అందుకే దర్శకుడు తేజ 2 గంటల 40 నిముషాల పాటు కథను చెప్పారని రానా తెలిపారు.

చిత్ర కథ, అందులో నా పాత్ర నాకు మాత్రమే గాక మా నాన్నకు కూడా బాగా నచ్చాయి. మా ఇద్దరికీ నచ్చిన ఏకైక కథ ఇది. డైరెక్టర్ తేజ సినిమాను చాలా బాగా తీశారు. ఒక సాధారణ యువకుడైన జోగేంద్ర తన చుట్టూ ఉన్న కొన్ని దుష్ట పరిస్థితుల వలన ఎలా మారాడు, ఆ మార్పుల వలన అతని వైవాహిక జీవితం ఎలా ప్రభావితమైంది అనేదే ఇందులో ప్రధానాంశం అన్నారు. ఈ చిత్రంలో రానాకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా నవదీప్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook