అనుష్క ‘భాగమతి’ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ !
Published on Aug 17, 2017 6:12 pm IST


‘బాహుబలి’ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమా నిర్మాణ విలువలు గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫికల్ వర్క్ మీద నడిచే సినిమాలైతే హై స్టాండర్డ్స్ లో ఉంటేనే చూస్తున్నారు. అందుకే నిర్మాతలు, దర్శకులు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వాటి విషయంలో ఖర్చుకు వెనుకాడటంలేదు. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో జి. అశోక్ నిర్మిస్తున్న ‘భాగమతి’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

చిత్రీకరణ పూర్తైపోయినా కూడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ విజువల్ ఎఫెక్ట్స్ లో కూడా పూర్తి ఖచ్చితత్వం కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్కుకు కొన్ని నెలలపాటు సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న విఎఫ్ఎక్స్ పనులు నవంబర్ వరకు జరుగుతాయని ఆ తర్వాత డిసెంబర్ లో సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. మరి గ్రాఫిక్స్ ఆధారంగా రూపొందిన ‘అరుంధతి’ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క ‘భాగమతి’ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 
Like us on Facebook