సింగం 3 లో సూర్యతో కలిసి స్టెప్పులు వేయనున్నది ఎవరో తెలుసా !

Neetu-Chandra-
హీరో సూర్య కెరీర్లోనే అతి పెద్ద హిట్ గా చెప్పుకునే ‘సింగం’ సిరీస్ లో మూడవ పార్ట్ ‘సింగం – 3’ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త తమిళ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమంటే ఈ చిత్రంలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్ లో ఒకప్పుడు మంచి సినిమాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న నటి ఒకరు సూర్యతో కలిసి స్టెప్పులు వేయనుందట.

ఆమె మరెవరో కాదు.. నీతూ చంద్ర. ఒకప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నీతూ చంద్ర పలు హిట్ సినిమాల్లో నటించి ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో నెమ్మదిగా సినిమాలు తగ్గించింది. మళ్ళీ ఇప్పుడు సూర్య సినిమాలో మంచి అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ డిసెంబర్ 16న విడుదలకానుంది. హరి దర్శకత్వం వహిసున్న ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.