ఇంట్రెస్టింగ్ రన్ టైం తో హిందీ “ఛత్రపతి”.!

Published on May 11, 2023 2:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో చేసిన ఎన్నో చిత్రాల్లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తో మొదటి సారి చేసి భారీ హిట్ సినిమా “ఛత్రపతి” కోసం తెలిసిందే. అయితే తెలుగులో ఎంతో పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమాని తెలుగు నుంచే మరో హీరో అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో “ఛత్రపతి” గా చేసాడు. మన టాలీవుడ్ దర్శకుడు రీమేక్స్ లో స్పెషలిస్ట్ అయ్యిన దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ తో సెన్సేషన్ రేపింది.

ఇక ట్రైలర్ వచ్చాక కూడా మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం రన్ టైం ఇప్పుడు బయటికి వచ్చింది. అయితే హిందీలో ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని చాలా వరకు తగ్గించేయడం విశేషం. హిందీలో ఈ సినిమా కేవలం 123 నిమిషాల 47 సెకండ్స్ మాత్రమే వచ్చిందట. అంటే కేవలం రెండు గంటల సినిమాగా మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పాలి. దీనితో ఒరిజినల్ లో చాలా సీన్స్ ఈ సినిమాలో లేనట్టే అనుకోవాలి. మరి రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :