“జెర్సీ” చిత్రం మరోసారి వాయిదా.. ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ..!

Published on Dec 28, 2021 10:02 pm IST

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన “జెర్సీ” చిత్రం మరోసారి వాయిదా పడింది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి హిందీలో తెరకెక్కించారు. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం విడుదల తేదిని డిసెంబర్‌ 31కి మార్చినట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.

అయితే తాజాగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను మళ్లీ వాయిదా వేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అలాగే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :