హిందీ వెర్షన్ “అలా వైకుంఠపురములో” ప్రీమియర్ డేట్ లో మార్పు

Published on Feb 1, 2022 11:00 pm IST

అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ అయిన అల వైకుంఠపురములో హిందీ వెర్షన్‌ని గోల్డ్‌మైన్ టెలిఫిల్మ్స్ తన దించక్ ఛానెల్‌లో ప్రీమియర్ చేయడానికి ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అల వైకుంఠపురములో హిందీ వెర్షన్‌ను ఫిబ్రవరి 6, 2022న విడుదల చేయనున్నట్లు వారు ముందుగా ప్రకటించారు, కానీ ఇప్పుడు ఫిబ్రవరి 13, 2022న విడుదల చేయనున్నట్లు సరికొత్త తేదీని అందించారు.

హిందీ వెర్షన్ లో విడుదల వాయిదా వెనుక గల కారణాలు తెలియరాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. సినిమా విజయంలో తమన్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది.

సంబంధిత సమాచారం :