సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో చేసిన అవైటెడ్ సీక్వెల్ సినిమానే జైలర్ 2. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి క్రేజీ ట్రైలర్ ని ఎట్టకేలకు మేకర్స్ విడుదల చేసారు. తెలుగు, తమిళ్ హిందీలో విడుదల చేసిన ఈ ట్రైలర్ కి ఆడియెన్స్ నుంచి డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో చాలామందినే స్టార్ నటీనటులుని చూపించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు కూడా ఉన్నారు.
కానీ ఒక్క హీరో ప్రెజెన్స్ పై మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఇందులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ తనని మాత్రం రివీల్ చేయలేదు. సో తనపై సీన్స్ నేరుగా థియేటర్స్ లోనే ఉంటాయని చెప్పొచ్చు. సో ఈసారి నెల్సన్ ఎలా ప్లాన్ చేసాడో చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కాబోతోంది.
