రికార్డుల బాహుబలి మరో ఘనత..!


ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల పరంపర కొనసాగించిన బాహుబలి 2 చిత్రం 100 రోజుల ఘనతని పూర్తి చేసుకుంది. కనివిని ఎరుగని అంచనాలతో ఏప్రిల్ 28 న బాహుబలి 2 చిత్రం విడుదలైంది. అంచనాలను అందుకోవడమే కాకూండా ప్రపంచ సినిలోకాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ తెలుగుచిత్రం 1700 కోట్ల గ్రాస్ ని అందుకోవడం సంచలనమే.

ఈ చిత్రంతో దర్శకుడు రాజమౌళి, హీరోప్రభాస్ లో ఇండియాలో స్టార్ లు గా మారిపోయారు. ఈ చిత్రంలో విలన్ గా నటించిన రానా నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కగా, అనుష్క, సత్యరాజ్, రమ్య కృష్ణ మరియు తమన్నా లు కూడా అద్భుతమైన నటన కనబరిచారు. శోభు మరియు ప్రసాద్ లు ఏ విజువల్ వండర్ ని నిర్మించారు.