ఓటిటిలో అజిత్ సినిమాకి నెట్ ఫ్లిక్స్ హిస్టారికల్ డీల్.!

ఓటిటిలో అజిత్ సినిమాకి నెట్ ఫ్లిక్స్ హిస్టారికల్ డీల్.!

Published on Dec 25, 2022 4:30 PM IST


కోలీవుడ్ స్టార్ హీరోస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ నటుడు అజిత్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “తునివు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించగా ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. మరి తెలుగులో “తెగింపు” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఓ తమిళ సినిమా దగ్గర భారీ రికార్డు సెట్ చేసినట్టుగా తమిళ్ సినీ ట్రాకర్స్ అంటున్నారు.

ఈ చిత్రం ఓటిటి హక్కులు దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రానికి అయితే నెట్ ఫ్లిక్స్ వారు కోలీవుడ్ హిస్టరీ లో ఏ సినిమాకి ఇవ్వని భారీ ధర ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే అజిత్ సినిమా ఈ రకంగా హిస్టారికల్ డీల్ ని సెట్ చేసింది. ఇక ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించగా మంజు వారియర్ ఫీమేల్ లీడ్ లో నటించింది. అలాగే బోనీ కపూర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు