నైజాంలో “నాన్ RRR” రికార్డ్స్ మొదలు..ఫస్ట్ డే భారీ వసూళ్ల వివరాలు.!

నైజాంలో “నాన్ RRR” రికార్డ్స్ మొదలు..ఫస్ట్ డే భారీ వసూళ్ల వివరాలు.!

Published on Mar 26, 2022 11:20 AM IST

ఇప్పుడు మళ్ళీ ఇండియన్ సినిమా దగ్గర వీక్షకులు ఓ సినిమా వసూళ్ల కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సినిమానే “రౌద్రం రణం రుధిరం”. దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం తన ఫస్ట్ డే ని బాక్సాఫీస్ వద్ద కంప్లీట్ చేసుకుంది.

భారీ లెవెల్లో ఓపెనింగ్స్ అన్ని చోట్లలా అందుకున్న ఈ చిత్రం నైజాం లో మొదటి రోజు బాక్సాఫీస్ హంట్ ని నాన్ RRR రికార్డ్స్ తో మొదలు పెట్టినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఇక్కడ గాను ఈ చిత్రం ఏకంగా 23.3 కోట్ల షేర్ ని రాబట్టిందట. ఇది హిస్టారికల్ డే 1 భారీ రికార్డు అని అంటున్నారు.

దీనితో ఈ సినిమాపై ఉన్న హైప్ కి అభిమానులు చూపించిన ఆదరణకు సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ గట్టి బిజినెస్ నే జరిపిన ఈ చిత్రం ఫస్ట్ డే వసూళ్లు లెక్కన చూస్తే ఆ వసూళ్లు అంతా జస్ట్ వారం లోపే కొట్టేసేలా కనిపిస్తుంది. మరి ఈ భారీ సినిమా ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు