యుఎస్ఏ లో హాఫ్ మిలియన్ కొట్టిన ‘హిట్ – 2’

యుఎస్ఏ లో హాఫ్ మిలియన్ కొట్టిన ‘హిట్ – 2’

Published on Dec 4, 2022 2:06 AM IST


అడివిశేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్స్ మూవీ హిట్ 2. హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన ఈ సెకండ్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించగా ఇతర పాత్రల్లో రావు రమేష్, తనికెళ్ళ భరణి, సుహాస్, కోమలి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు కీలక పాత్రలు చేసారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సమర్పించిన ఈ మూవీని ప్రశాంతి తిపిర్నేని ఎంతో భారీగా నిర్మించారు.

అయితే మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన హిట్ 2 మూవీ నిన్న రిలీజ్ తరువాత ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకాభిమానులు ఈ మూవీకి నీరాజనాలు పడుతున్నారు. కాగా అటు యుఎస్ఏ ఆడియన్స్ ని సైతం ఎంతో ఆకట్టుకుంటున్న ఈ మూవీ నేటితో ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకోవడం విశేషం. రోజురోజుకు యుఎస్ఏ లో మూవీకి మరింతగా క్రేజ్ పెరుగుతోందని, తప్పకుండా రాబోయే రోజుల్లో అక్కడ కూడా హిట్ 2 మరింత భారీ కలెక్షన్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు