యూఎస్ లో మరో మార్క్ క్రాస్ చేసిన “హిట్ 2”.!

యూఎస్ లో మరో మార్క్ క్రాస్ చేసిన “హిట్ 2”.!

Published on Dec 8, 2022 9:00 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. మరి ఈ చిత్రం అయితే శేష్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలవగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రం యూఎస్ రన్ విషయానికి వస్తే ఇప్పుడు మరో మార్క్ ని అయితే ఈ చిత్రం అందుకుంది.

లేటెస్ట్ గా ఈ చిత్రం 9 లక్షల డాలర్స్ మార్క్ ని అయితే క్రాస్ చేసి రికార్డు మైల్ స్టోన్ 1 మిలియన్ డాలర్స్ దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ థ్రిల్లర్ లో అయితే నాచురల్ స్టార్ నాని కూడా సూపర్బ్ క్యామియో లో కనిపించగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ ఫ్రాంచైజ్ ని ముందు రోజుల్లో మరింత భారీగా ప్లాన్ చేయనున్నాడు అలాగే నెక్స్ట్ హిట్ 3 సినిమాలో తాను హీరోగా నటించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు