యుఎస్ఏ లో భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ‘హిట్ – 2’

యుఎస్ఏ లో భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ‘హిట్ – 2’

Published on Dec 7, 2022 2:07 AM IST


విలక్షణ నటుడు అడివి శేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్స్ మూవీ హిట్ 2. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కేడి అనే పాత్రలో అడివి శేష్ తన అద్భుత నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకోగా ఆర్య పాత్రలో కనిపించి తన అందం, అభినయంతో అలరించారు మీనాక్షి. శైలేష్ కొలను తీసిన ఈ మూవీ నాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందగా ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇక ఇటీవల రిలీజ్ తరువాత ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మన రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ సహా అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న హిట్ 2 మూవీ అటు యుఎస్ఏ లో సైతం అదరగొడుతోంది. కాగా తమ మూవీ ఇప్పటివరకు యుఎస్ఏ లో 825కె డాలర్స్ కలెక్షన్ అందుకున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే అతి త్వరలో ఈ మూవీ యుఎస్ఏ లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవడం ఖాయంగా కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు