యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘హిట్ 2’.. హిట్ !

Published on Dec 5, 2022 10:56 am IST


యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్ “హిట్ 2”. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రివ్యూస్ తో బాగానే వసూళ్లు రాబడుతుంది. కాగా ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీసు దగ్గర $1 మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు యూఎస్ లో $700K వసూళ్లను రాబట్టింది. శేష్ కెరీర్ లోనే అత్యంత వేగంగా ఇంత మొత్తాన్ని వసూలు చేసిన చిత్రం ఇదే కావడం విశేషం.

మొత్తమ్మీద ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది, ఇందులో హర్షవర్ధన్, రావు రమేష్, కోమలి ప్రసాద్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే హీరో నాని చేసిన గెస్ట్ రోల్ కూడా బాగుంది. ఇక నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ఈ ప్రాజెక్టును నిర్మించింది.

సంబంధిత సమాచారం :