హిందీ రిలీజ్ కి గ్రాండ్ గా రెడీ అయిన అడివి శేష్ ‘హిట్ – 2’

హిందీ రిలీజ్ కి గ్రాండ్ గా రెడీ అయిన అడివి శేష్ ‘హిట్ – 2’

Published on Dec 29, 2022 3:02 AM IST

యువ నటుడు అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సక్సెస్ఫుల్ థ్రిల్లింగ్ సస్పెన్స్ యాక్షన్ మూవీ హిట్ 2 ది సెకండ్ కేస్. ఆద్యంతం ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందిన ఈ మూవీలో కేడి అలియాస్ కృష్ణ దేవ్ పాత్ర లో తన అలరించే అద్భుత నటనతో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు యువ నటుడు అడివి శేష్.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన హిట్ 2 తెలుగులో అందరినీ ఆకట్టుకోవడంతో ఈ మూవీని డిసెంబర్ 30న హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు యూనిట్ సభ్యులు. తప్పకుండా తమ మూవీ హిందీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని హిట్ 2 మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరొక రెండు రోజుల్లో ఈ మూవీ హిందీలో రిలీజ్ కి రెడీ అవడంతో పలువురు తెలుగు ఆడియన్స్ సైతం అక్కడ ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు