యూఎస్ లో అదరగొట్టిన “హిట్ 2” ప్రీమియర్స్.!

Published on Dec 2, 2022 7:58 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. మరి దర్శకుడు శైలేష్ నుంచి తన ఫ్రాంచైజ్ లో రెండో సినిమాగా సాలిడ్ బజ్ తో అయితే ఈ చిత్రం బయటకి వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలకి తగ్గట్టే యూఎస్ మార్కెట్ లో అయితే సాలిడ్ నంబర్స్ నమోదు చేస్తూ ప్రీమియర్స్ ని షో చేసుకుంది.

ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే హిట్ 2 కి ఒక్క యూఎస్ నుంచి లక్ష 50 వేల డాలర్స్ ని క్రాస్ చేసినట్టుగా అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రైమ్ మీడియా వారు అయితే తెలియజేసారు. మరి డే 1 తో కలిపి అయితే మరిన్ని మంచి వసూళ్లు ఈ చిత్రం నమోదు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అయితే సురేష్ బొబ్బిలి సంగీతం అందివ్వగా నాచురల్ స్టార్ నాని అయితే ఈ ఫ్రాంచైజ్ ని ప్రెజెంట్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :