మరింత థ్రిల్లింగ్ ఛాలెంజ్ తో “హిట్ 2” టీజర్.!

మరింత థ్రిల్లింగ్ ఛాలెంజ్ తో “హిట్ 2” టీజర్.!

Published on Nov 3, 2022 11:22 AM IST

మన టాలీవుడ్ మంచి థ్రిల్లర్ చిత్రాలకి కేరాఫ్ అయ్యిన అతి కొద్దీ మంది హీరోస్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ కూడా ఒకడు. మరి కేవలం తన స్వీయ రచన లతోనే కాకుండా ఇతర దర్శకులతో కూడా మంచి ఇంట్రెస్టింగ్ చిత్రాలు తాను చేసాడు. ఇక ఈ కోవలో అయితే తాను అనౌన్స్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “హిట్ 2”. దర్శకుడు శైలేష్ కొలను స్టార్ట్ చేసిన ఈ చిత్రం క్రైమ్ ఫ్రాంచైజ్ గా స్టార్ట్ అయ్యింది.

మరి మొదటి సినిమాని అయితే మేకర్స్ హీరో విశ్వక్ సేన్ తో స్టార్ట్ చెయ్యగా ఇప్పుడు అడివి శేష్ వంతు అయితే వచ్చింది. మరి ఈ టీజర్ మరింత ఫ్రెష్ గా అనిపిస్తుందని చెప్పాలి. శేష్ బాడీ లాంగ్వేజ్ తన డైలాగ్ డెలివరీ అంతా కూడా కొత్తగా మారిపోగా పెద్దగా పట్టింపు లేని ఆఫీసర్ కి ఓ ఛాలెంజింగ్ కేస్ దొరికితే ఎలా ఉంటుంది అనేది ఈ టీజర్ లో డైరెక్టర్ మంచి హార్డ్ హిట్టింగ్ గా చూపించాడు.

అలాగే ఈ చిత్రంలో ముందులా కాకుండా కొత్త విలన్ ని కూడా పరిచయం చేసి మరింత థ్రిల్ రేపారు. ఇక రావు రమేష్ కొత్త లుక్, ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరి లు టీజర్ లో మంచి స్పేస్ తో ఆకట్టుకున్నారు. అలాగే జాన్ స్టీవర్ట్ ఏడూరి స్కోర్ కూడా ఇందులో ఆసక్తిగా ఉంది. మొత్తానికి అయితే ఓ క్రేజీ థ్రిల్లర్ ని మళ్ళీ మేకర్స్ అందిస్తున్నట్టు అర్ధం అవుతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు