అదిరే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో “హిట్ 2” ట్రైలర్.!

అదిరే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో “హిట్ 2” ట్రైలర్.!

Published on Nov 23, 2022 11:25 AM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రాల్లో దర్శకుడు శైలేష్ కొలను తో చేసిన చిత్రం “హిట్ 2” కూడా ఒకటి. ఖిలాడీ ఫేమ్ నటి మీనాక్షి చౌదరి నటించిన ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఆల్రెడీ సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మేకర్స్ అయితే థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ అయితే స్యూర్ షాట్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. సాలిడ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో పాటుగా తనికెళ్ల భరణి లాంటి నటులతో మంచి ఎమోషన్స్ ని శైలేష్ యాడ్ చెయ్యడంతో ఈ ట్రైలర్ మరింత గ్రిప్పింగ్ గా కనిపిస్తుంది. అలాగే గ్యారీ బి హెచ్ సంగీతం కూడా అదనపు హైలైట్ గా ఈ ట్రైలర్ లో నిలవగా ఆ ఇన్వెస్టిగేషన్ లో అడివి శేష్ మరోసారి తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు.

అలాగే తనకి ఎదురయ్యే ఛాలెంజ్ లు విలన్ ని పట్టుకోవడంలో సస్పెన్స్ ఫ్యాక్టర్ ముందు హిట్ సినిమా కన్నా ఇందులో డబుల్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. ఇక లాస్ట్ లో అయితే ఆ అమ్మాయి హత్య కేసులో ఇచ్చిన ట్విస్ట్ మరింత షాకింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంది. దీనితో అయితే ఈ డిసెంబర్ 2న మాత్రం ఆడియెన్స్ కి ఓ క్రేజీ థ్రిల్లర్ రైడ్ శేష్, నాని అండ్ శైలేష్ కాంబో నుంచి రాబోతుంది అని చెప్పాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు