“హిట్ 2” డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే.!

“హిట్ 2” డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే.!

Published on Dec 3, 2022 5:02 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ థ్రిల్లర్ హిట్ చిత్రం “హిట్ 2”. తమ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ సాలిడ్ చిత్రం ఆడియెన్స్ అంచనాలు అందుకొని మొదటి రోజు క్రేజీ వసూళ్లు తెలుగు స్టేట్స్ లో నమోదు చేసినట్టుగా బయటకి వచ్చింది.

ఇక అలాగే వరల్డ్ వైడ్ అయితే శేష్ కెరీర్ లో హిట్ 2 మరో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచినట్టు తెలుస్తుంది. మరి మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసిన దాని ప్రకారం అయితే వరల్డ్ వైడ్ 11.27 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి అదరగొట్టింది. అలాగే ఈ వసూళ్లతో కూడా అడివి శేష్ తన కెరీర్ లో బెస్ట్ వసూళ్లు వచ్చినట్టుగా ఎగ్జైట్మెంట్ ని కూడా వ్యక్తం చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు