“హిట్ 3” కి సెన్సేషనల్ కంపోజర్..డైరెక్టర్ ఫన్ పోస్ట్.!

“హిట్ 3” కి సెన్సేషనల్ కంపోజర్..డైరెక్టర్ ఫన్ పోస్ట్.!

Published on Dec 13, 2022 1:00 PM IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. హీరో మరి దర్శకుడు కెరీర్ లో మంచి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం లో ఉన్న ఎన్నో సర్ప్రైజ్ లతో పాటుగా క్లైమాక్స్ లో నాచురల్ స్టార్ నాని ఎంట్రీ కూడా ఓ సెన్సేషన్ గా మారింది.

అయితే ఇక నాని ఎంట్రీ తో “హిట్ 3” కి కూడా సాలిడ్ బజ్ నెలకొనగా ఈ సినిమా అనౌన్స్ కావడంతోనే సంగీత దర్శకుడు అనిరుద్ ఆ సినిమాకి కావాలని ఆడియెన్స్ సహా ఫ్యాన్స్ నుంచి గట్టి డిమాండ్ దర్శకుడు శైలేష్ దగ్గరకి వెళ్ళింది. మరి లేటెస్ట్ గా అయితే తాను నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అనిరుద్ నే తీసుకోవాలి అన్నట్టుగా తన ఆలోచన కూడా రివీల్ చేసాడు.

మరి దీనిపై వెంకీ చిత్రం నుంచి ఓ ఫన్నీ మీమ్ తో అయితే దీనిని కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ హింట్ తో అయితే నెక్స్ట్ ఆల్ మోస్ట్ అనిరుద్ మరియు నాని కాంబినేషన్ ని సెన్సేషనల్ ఆల్బమ్ కన్ఫర్మ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు