నేను హిట్టు కొట్టడానికి రెడీగా ఉన్నానన్న అఖిల్ !

అఖిల్ తాజా చిత్రం ‘హలో’ ఆడియో వేడుక నిన్న సాయంత్రం వైజాగ్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అఖిల్ మాట్లాడుతూ రెండేళ్లు నాకు రిలీజ్ లేకపోయినా అభిమానులు ఎంతగానో సపోర్ట్ చేశారని, ఈసారి తాను హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆరంభంలో ఆట, పాటతో అలరించాడు అఖిల్.

అలాగే విక్రమ్ కుమార్ తనను ఎంచుకున్నప్పుడు ఆయనకు కావల్సిన స్థాయిలో తాను లేనని, అయినా తనను తీసుకుని అన్నింటిలో కాన్ఫిడెంట్ గా ఉండేట్టు చేశారని అన్నారు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించారు.