“హిట్ 2” కిల్లర్ పై మేకర్స్ క్లారిటీ..!

Published on Dec 1, 2022 9:26 pm IST


తెలుగు ప్రేక్షకులు హిట్ 2 విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. అడివి శేష్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను సీక్వెల్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాలో కిల్లర్ ను రివీల్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

స్పాయిలర్స్ ఇచ్చి థియేటర్లలో సినిమాను రికార్డ్ చేసేవారే అసలైన కిల్లర్స్ అని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ స్పాయిలర్‌లు ముఖ్యంగా థ్రిల్లర్‌ల కోసం ముఖ్యమైన ట్విస్ట్ లను బహిర్గతం చేయడం ద్వారా ఇతర ప్రేక్షకుల ఉత్సాహాన్ని చంపేస్తాయి. కాబట్టి ఇది కిల్లర్ అప్డేట్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం తమ టీమ్ ఎంత కష్టపడి పనిచేశారో తెలియజేస్తూ సినిమా గురించి ఎలాంటి విషయాలు వెల్లడించవద్దని అడివి శేష్ ఆడియెన్స్ ను అభ్యర్థించారు. మేకర్స్ ప్రత్యేక ప్రచార వ్యూహం బజ్‌ను మరింత పెంచింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దద్దరిల్లుతుంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమా లో కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :