యూఎస్ లో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతున్న అడివి శేష్ “హిట్2”

యూఎస్ లో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతున్న అడివి శేష్ “హిట్2”

Published on Nov 16, 2022 9:22 PM IST


టాలివుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో కెరీర్‌లో వేగంగా అడుగులు వేస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హిట్2 చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన భారీగా ఓవర్సీస్‌లో కూడా విడుదల కానుంది. ఫార్స్ ఫిల్మ్స్ మరియు క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని యుఎస్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్ మాగంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు