‘కళ్యాణం కమనీయం’ మూవీ నుండి ‘హో ఎగిరే’ లిరికల్ సాంగ్ రిలీజ్

‘కళ్యాణం కమనీయం’ మూవీ నుండి ‘హో ఎగిరే’ లిరికల్ సాంగ్ రిలీజ్

Published on Dec 29, 2022 5:27 PM IST

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యువ నటుడిగా ఒక్కో సినిమాతో మంచి విజయాలని అందుకుంటూ అలానే ఆడియన్స్ యొక్క క్రేజ్ తో కొనసాగుతున్నారు సంతోష్ శోభన్. ఇటీవల మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఆకట్టుకున్న సంతోష్ శోభన్, లేటెస్ట్ గా చేస్తున్న మూవీ కళ్యాణం కమనీయం. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ పై పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా ప్రియా భవాని శంకర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.

తాజాగా ఈ కళ్యాణం కమనీయం సినిమా నుంచి హో ఎగిరే అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. ఓ కాటుక కన్నే కన్నే మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే అంటూ మెలోడియస్ గా ఓ యువ జంట మధ్య ప్రేమను వ్యక్తపరుస్తూ సాగిన ఈ పాట యువతని ఎంతో ఆకట్టుకుంటోంది.

ఇక ఇటీవలే రిలీజైన ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. సినిమాకి సంబంధించి ప్రస్తుతం లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు యూనిట్. ఈ పాటలు అందమైన సంగీత సాహిత్యాలతో అందరినీ ఆకట్టుకుంటూ మూవీ పై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కళ్యాణం కమనీయం సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు