భగవద్గీత గురించి హాలీవుడ్ స్టార్ హీరో “విల్ స్మిత్” కీలక వ్యాఖ్యలు

Published on Sep 19, 2021 7:10 pm IST

భగవద్గీత గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది ఈ భగవద్గీత. భారత దేశం లో మాత్రమే కాకుండా చాలా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందింది. అయితే తాజాగా ప్రముఖ హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ఈ మేరకు ఒక ఇంటర్వ్యూ లో భగవద్గీత గురించి ప్రస్తావించడం జరిగింది.

భగవద్గీత గురించి చెబుతూ విల్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గందరగోళ పరిస్థితి నుండి బయట పడటానికి శ్రీ భగవద్గీత తనకు ఎంతగానో సహయ పడింది అని వ్యాఖ్యానించారు. శ్రీ భగవద్గీత మీ అంతరాత్మను మేలు కొల్పే జీవిత సారాంశం అంటూ చెప్పుకొచ్చారు. విల్ స్మిత్ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :