‘ది గ్రేట్’ రాజమౌళి అంటున్న హాలీవుడ్ దర్శకులకి జక్కన్న రిప్లై వైరల్.!

Published on Jul 30, 2022 1:57 pm IST


దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రభాస్ తో చేసిన తన బాహుబలి సిరీస్ తో ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. ఇక లేటెస్ట్ గా అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో చేసిన “రౌద్రం రణం రుధిరం” తో అయితే పాన్ వరల్డ్ లెవెల్లో తెలుగు సినిమా ఖ్యాతిని మరే ఇతర భారతీయ సినిమా అందుకొని విధంగా తీసుకెళ్లి పెట్టారు.

మరి ఈ రేంజ్ లో సినిమాని చెక్కిన జక్కన్న వర్క్ కి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఇతర సినీ ప్రముఖులు ముగ్ధులు కాగా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర అవెంజర్స్ లాంటి క్రేజీ సిరీస్ ని తెరకెక్కించిన దర్శకులు రూసో బ్రదర్స్ కూడా రాజమౌళి వర్క్ కి ఫిదా అయ్యి తనతో కలిసి వర్క్ చెయ్యాలని తనకి కలవడం చాలా ఆనందంగా అనిపించింది అని వారు తెలిపారు.

అంతే కాకుండా రాజమౌళి కోసం మాట్లాడుతూ ‘ది గ్రేట్’ రాజమౌళి అంటూ వారు చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. ఇక దీనితో జక్కన్న కూడా ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. తమని కలవడం నాకు కూడా ఎంతో ఆనందంగా గౌరవంగా భావిస్తున్నానని మరొకసారి తమని కలిసి వారి క్రాఫ్ట్స్ నుంచి కొంతమేర వర్క్ ని నేర్చుకోవాలి అనుకుంటున్నానని రాజమౌళి తెలిపారు. దీనితో ఈ ఆసక్తికర రిప్లై వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :