“సలార్” ఎందుకిలా ఉందో..హాలీవుడ్ నుంచి ఆన్సర్.!

Published on Sep 25, 2021 3:00 pm IST

ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వారు ఉండరు.. తనదైన లైనప్ తో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ లోకి దూసుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్స్ లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తీస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొల్పుకుంది.

సరిగా అప్పుడు నుంచే ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర చిలిపి ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. సినిమా పోస్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ నలుపు షేడ్ లో కనిపిస్తుండడంతో నీల్ పై కొన్ని ఫన్నీ ట్రోల్స్ కూడా వచ్చాయి. కేజీయఫ్ లో కూడా అంతే ఒక రకమైన పొగ కాస్త డిఫరెంట్ సినిమాటోగ్రఫీ కనిపించింది. దీనితో సలార్ కి కూడా ఇదే విధంగా అందరిలో ప్రశ్న మొదలయ్యింది.

కానీ ఇప్పుడు సలార్ ఎందుకు ఇలా కనిపిస్తుంది సమాధానం హాలీవుడ్ లెవెల్లో దొరికింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ హాలీవుడ్ లో బాగా వినియోగించే “డార్క్ సెంట్రిక్ థీమ్” ని ఈ సినిమాకి వినియోగిస్తున్నారట. సినిమా లవర్స్ కి ‘బాట్ మాన్’ సిరీస్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ఇంకొన్ని డార్క్ గా కనిపించే సినిమాలు చూసే ఉంటారు అలాంటి తరహాలోనే సలార్ కూడా మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కుతుందట. సో సలార్ డార్క్ సీక్రెట్ ఇది..

సంబంధిత సమాచారం :