ప్రభాస్ కోసం అప్పట్లోనే హాలీవుడ్ లెవెల్ కథ సెట్ చేసిన దర్శకుడు.!

Published on Jul 13, 2022 2:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సహా పాలన్ ఆసియా నుంచి వరల్డ్ లెవెల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా ఇప్పుడు సినిమాల కోసం చాలా మంది చెప్తున్నారు కానీ ప్రభాస్ తో అయితే ఎప్పుడో తన “చక్రం” సినిమా టైం లో హాలీవుడ్ సినిమాని ప్లాన్ చేసినట్టుగా ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తెలపడం ఆసక్తిగా మారింది.

రీసెంట్ గా తాను ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రభాస్ కి చక్రం కన్నా ముందు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మన దగ్గర నుంచి ఒక మ్యాడ్ మాక్స్ లాంటి ఒక సాలిడ్ యాక్షన్ సబ్జెక్టు ని చెప్పానని ఆ సినిమా చాలా బాగుంటుందని చేద్దాం అని చెప్పగా ప్రభాస్ అందరూ యాక్షన్ కథలే చెప్తున్నారు. వేరేది చేద్దాం అని చెప్తే అప్పుడు చక్రం సినిమా చేశామని తెలిపారు. అయితే అప్పట్లోనే ప్రభాస్ తో హాలీవుడ్ లెవెల్ సబ్జెక్ట్ ప్రభాస్ కి వచ్చి మిస్సయ్యింది. మరి ఫ్యూచర్ లో ఏమన్నా ఇది పాజిబుల్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :