‘సలార్’ క్లైమాక్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ !

‘సలార్’ క్లైమాక్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ !

Published on Nov 20, 2022 11:31 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ ఒకటి. అయితే, సలార్ షూటింగ్‌కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్ ని తీసుకువచ్చారట. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని టాక్ నడుస్తోంది. ఇక ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి.

కాగా ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు