యంగ్ రెబల్ స్టార్ “ప్రభాస్” కి హొంబలే ఫిల్మ్స్ మరియు RCB టీమ్ థాంక్స్!

Published on Apr 11, 2022 1:01 pm IST

ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ సంస్థ ఐపిఎల్ జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో అసోసియేట్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనను ఒక వీడియో ద్వారా చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హొంబలే సంస్థ కి మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి ప్రభాస్ తాజాగా స్పెషల్ విషెస్ తెలిపారు. వీరి నుండి ఏం వస్తుందో ఆసక్తి గా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

ప్రభాస్ చేసిన పోస్ట్ పై నిర్మాణ సంస్థ స్పందిస్తూ థాంక్స్ తెలిపింది. అదే విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కూడా తమకు మద్దతు ఇస్తున్నందుకు థాంక్స్ చెబుతూ, ప్రభాస్ పై ప్రశంశల వర్షం కురిపించడం జరిగింది. త్వరలో RCB మ్యాచ్ కి మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఉన్నాం అంటూ తెలిపింది. అంతేకాక సినిమాల్లో బోల్డ్ గా నటించడం కొనసాగించండి అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు వీరు చేసిన పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రభాస్ తన తదుపరి చిత్రం అయిన సలార్ హొంబలే బ్యానర్ పై చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ఈ సినిమా కి డైరెక్టర్ గా వ్యవహరించడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :