పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం హనీ ట్రాప్. ఈ చిత్రం లో రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథా కథనం అందించి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు వామన రావు. అయితే తాజాగా హనీ ట్రాప్ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. అయితే సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె ఈ కార్యక్రమం కి అతిథులు గా వచ్చి టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు.
అయితే సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ, సమాజానికి అవసరం అయ్యే పాయింట్ తో కమర్షియల్ సినిమాలు చేయడం సునీల్ కుమార్ రెడ్డి ప్రత్యేకత అని అన్నారు. కమిట్ మెంట్ తో సినిమాలు చేసే ఆయనంటే గౌరవం అని అన్నారు. అయితే హనీ ట్రాప్ అనేది మన రియల్ లైఫ్ లో వింటూ ఉంటాం అని,గొప్ప పేరున్న వ్యక్తులు హనీ ట్రాప్ లో పడి పేరు పాడు చేసుకుంటారు అని అన్నారు. అయితే అయితే ఈ మూవీ ను సునీల్ ఎంత బాగా తీసి ఉంటారో ఊహించగలను అని అన్నారు. అయితే సంగీత దర్శకులు రఘు కుంచె మాట్లాడుతూ, ఇలా ఓ సినిమా ఆడియో సీడీ పట్టుకొని చాలా రోజులు అవుతుంది అని చెప్పుకొచ్చారు. అంతా డిజిటల్ అయ్యాక ఆడియో సీడీ లు కనిపించడం లేదని అన్నారు. హనీ ట్రాప్ మళ్ళీ ఇలాంటి అవకాశం కల్పించింది అని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అంటూ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రానికి సాహిత్యం అందించిన రవీంద్ర బాబు మాట్లాడుతూ, హాని ట్రాప్ చిత్రానికి వామన రావు మంచి స్క్రీన్ ప్లే అందించారు అని,సునీల్ కుమార్ ఆసక్తి గా తెరకెక్కించారు అని అన్నారు. ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం కలిగింది అని, బాగా వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్ర నటుడు శివ మాట్లాడుతూ, సునీల్ కుమార్ మాకు గురువు లాంటి వారు అని,గతం లో గల్ఫ్ సినిమాలో తనకి ఒక క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే హాని ట్రాప్ లో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె లకు థాంక్స్ తెలిపారు.
వివి వామన రావు మాట్లాడుతూ, కథా రచయిత గా ఎలా సినిమాను ఊహించుకున్నానో, సునీల్ కుమార్ అంతకన్నా బాగా తెరకెక్కించారు అని అన్నారు. అయితే హనీ ట్రాప్ ప్రివ్యూ చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నా టీమ్ అంటూ ఫ్యామిలీ మెంబెర్స్ లా ఉంటారు అని అన్నారు.మా అసోసియేషన్ కూడా అలానే కంటిన్యూ అవుతుంటుంది అని అన్నారు. అయితే సంగీత దర్శకులు ప్రవీణ్ ఇమ్మడి తనతో గంగ పుత్రులు నుండి12 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే రఘు కుంచె టీమ్ లో ఒక మెంబర్ అయినందుకు సంతోషం అని, ఆర్పీ పట్నాయక్ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు అని అన్నారు. వామన రావు నిర్మాతే కాదు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే తమ గత చిత్రాల్లాగా హాని ట్రాప్ కూడా తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని అన్నారు.
