హాట్ బజ్..శంకర్ సినిమాకి చరణ్ భారీ రెమ్యునరేషన్ వైరల్!

Published on Oct 12, 2021 7:00 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కెమెరూన్ శంకర్ ల కాంబినేషన్ లో అది కూడా తమ కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా 15వ ప్రాజెక్ట్ గా ఓ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ని టేకప్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే సాలిడ్ క్యాస్టింగ్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాపై ఇప్పుడు మరో హాట్ బజ్ న్యూస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇందులో ఎంతమేర నిజముందో కానీ ఈ ఒక్క సినిమాకు చరణ్ 80 కోట్లకి పైగా ఛార్జ్ చేస్తున్నాడట.

ఇదే నిజం అయితే ప్రస్తుతానికి ఇది అయితే ప్రభాస్ తర్వాత అత్యధికం అని చెప్పాలి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజ్ తమ బ్యానర్ లో 50వ సినిమాగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించబోతున్నారు.

సంబంధిత సమాచారం :