ఆ డైరెక్టర్ రాక్షసుడ్ని హీరోగా ఎలా చూపించనున్నాడో?

Gunasekhar Rana

గుణ శేఖర్ మరో భారీ ప్రాజెక్ట్ తెరక్కించడానికి సన్నధం అవుతున్నారు. దగ్గుబాటి రానా హీరోగా హిరణ్య కశిప అనే పౌరాణిక చిత్రాన్ని ఆయన త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఈ చిత్రం కొరకు గుణ శేఖర్ దాదాపు మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 2015లో రుద్రమదేవి చిత్రం తరువాత ఈయన మరో చిత్రం చేయలేదు. దగ్గుబాటి రానా టైటిల్ రోల్ హిరణ్య కశిపుడి గా కనిపించనున్నాడు. ఐతే హిరణ్య కశిపుడు పురాణాల్లో రాక్షసుడు దేవతల దృష్టిలో విలన్. మరి విలన్ ని తెరపై హీరోగా ఎలా పోట్రె చేస్తారు అనేది ఆసక్తికరం.

శివ భక్తుడైన హిరణ్య కశిపుడు విష్ణువు అంటే ద్వేషం కలిగి ఉంటాడు. శివుని వరం చేత మరణం లేని శక్తిగా ఎదుగుతాడు. పురాణాలలో కొందరు రాక్షసులు నీతి,నియమం ధర్మం కలిగినవారుగా ఉన్నారు. హిరణ్య కశిపుడు పాత్ర ఏ కోణం నుండి హీరోగా చూపిస్తాడో గుణశేఖర్ చూడాలి. గతంలో పురాణాల్లో విలన్స్ గా గుర్తింపు పొందిన రావణా సురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలను హీరోలుగా చేసిన చిత్రాలు అనేకం ఉన్నాయి.

Exit mobile version