రామూ ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా తీస్తున్నాడు?

rgv
ఒక సినిమా పూర్తిస్థాయిలో తెరమీదకు తీసుకురావాలంటే ఒక దర్శకుడికి కొన్ని నెలలు సమయం పడుతుంది. తాము అనుకున్న సినిమా తెరమీద కనబడాలి అంటే రాజమౌళి, శంకర్ వంటి దర్శకులు ఆ చిత్రాన్ని ఏళ్ళ తరబడి చెక్కుతూనేవుంటారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం ఏకకాలంలో పలు విభిన్న సినిమాలు తీసేస్తున్నాడు

ఇటీవలే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ‘ఐస్ క్రీమ్’ అనే సినిమా పోస్టర్ ని విడుదలచేసాడు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో కూడా ఎవరికీ తెలియదు. ఇలానే అసలు చడీచప్పుడూ లేకుండా రాజశేఖర్ తో పట్టపగలు సినిమా తీసేసాడు. ఇక విష్ణుతో టెన్షన్ టెన్షన్ అనే సినిమాని కూడా తీస్తున్నాడు

అసలు ఎవరికీ అంతుచిక్కని సమాధానానికి తగ్గ ప్రశ్న ఏమిటీ అంటే రామూ ఏకకాలంలో ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడా అని? అసలు ప్రతీ సినిమాపై మినిమం గ్రౌండ్ వర్క్ చెయ్యకుండా ఇలా చేసుకుంటూ పోతే చివరికి రామూ చివరి రోజుల్లో ఫ్లాపులు తప్ప హిట్ ల జాడ వుండదని కొందరి భావన

Exit mobile version