హీరో ఆది పినిశెట్టి ఒక్క పైసా కూడా కట్నం తీసుకోలేదట..!

Published on Jun 5, 2022 1:04 am IST

యంగ్ హీరో ఆది పినిశెట్టి ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. తాను ప్రేమించిన అమ్మాయి హీరోయిన్‌ నిక్కీ గల్రానీని మే 18న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. అయితే ఈ జంట రెండు రోజుల క్రితమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే అసలు ఆది ఎంత కట్నం తీసుకున్నాడంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. లవ్‌ మ్యారేజ్‌ అయినా కూడా భారీగానే కట్నం తీసుకుని ఉంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ కామెంట్లను ఆది సన్నిహితులు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. కట్నకానులకు ఆది వ్యతిరేకి అని, నిక్కీ కుటుంబం కట్నం ఇచ్చేందుకు రెడీగా ఉన్నా ఆది మాత్రం ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడని వారు చెప్పారు. ఆది చేసిన పనికి అతడి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

సంబంధిత సమాచారం :