ఆర్యన్ కి మద్దతుగా హృతిక్…డియర్ ఆర్యన్ అంటూ కీలక వ్యాఖ్యలు!

Published on Oct 7, 2021 2:00 pm IST

ప్రియమైన ఆర్యన్ అంటూ ఆర్యన్ ఖాన్ ను సంబోధిస్తూ ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డియర్ ఆర్యన్, జీవితం ఒక వింత ప్రయాణం. ఇది చాలా బావుంది ఎందుకంటే అనిశ్చితంగా ఉంటుంది కాబట్టి. జీవితం ఎన్నో బంతులను విసిరి వేస్తుంది, దేవుడు దయగల వాడు. టఫ్ గా ఉండేవారికే ఇలా కష్టతరమైన బాల్స్ ను వేస్తాడు. గందరగోళం గా ఉన్నప్పుడు మీరు ఎన్నుకో బడతారు అని తెలుసుకోండి. మీరు ఆ ఒత్తిడి అనుభవిస్తారు, ఆ అనుభూతి నాకు తెలుసు.

కోపం, గందరగోళం, నిస్సహాయత, హీరోని తగల బెట్టడానికి అవసరమైనవి చాలా నీలో ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండండి, కానీ దయ, కరుణ, ప్రేమ లు వాటిని కాల్చి వేస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండండి.వాటిని కాల్చడానికి అనుమతి ఇవ్వండి. వైఫల్యాలు, విజయాలు అన్ని ఒక్కటే అని తెలిస్తే ఏవీ మీ అనుభవం తో ఉంచుకోవాలి, వీటిని వదిలేయాలి అని తెలుస్తుంది అంటూ హృతిక్ రోషన్ అన్నారు.

కానీ మీరు ఎదగ గలరు అని తెలుసుకోండి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు నువ్వు బాగా తెలుసు. మీరు స్వంతం చేసుకొని ప్రతి ఒక్క విషయాన్ని అనుభవించండి, అవే మీ బహుమతులు. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇది చాలా అర్థవంతం గా ఉంటుంది అని తెలిపారు. బాగా వెలగాలి అంటే చీకట్లో కి వెళ్ళాలి. అంటూ తనకు మద్దతుగా నిలిచారు హృతిక్. అంతేకాక తప్పులు, అనుభవం సరికొత్త పాఠాలను నేర్పిస్తుంది అని, అవే అర్థవంతం గా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :