వైరల్ : తారక్ తో వర్క్ కోసం ఎగ్జైటెడ్ గా హృతిక్ రోషన్.!

Published on May 28, 2023 4:00 pm IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్న పలు క్రేజీ అండ్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో తెరకెక్కించనున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై ఆల్రెడీ స్ట్రాంగ్ బజ్ ఉండగా మొన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా హృతిక్ పెట్టిన పోస్ట్ దానికి తారక్ రిప్లై లతో అయితే ఈ మాసివ్ కాంబినేషన్ కన్ఫర్మ్ అయ్యిపోయింది.

ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో అయితే హృతిక్ రోషన్ లేటెస్ట్ గా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తారక్ తో వర్క్ చేయనుండడంపై కూడా మాట్లాడాడు. మరి తారక్ తో వర్క్ చేయడం విషయంలో అయితే తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని తెలిపాడట. అలాగే తన ప్రస్తుత ఫైటర్ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది అని కూడా తెలిపాడు. దీనితో తారక్ పై హృతిక్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో స్టార్ట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :