మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో మాజీ భార్య !

Published on Aug 7, 2022 1:29 am IST

హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ సతీమణి సుసానే ఖాన్‌ రెండో పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటుందని వార్తలు వసున్నాయి. హృతిక్‌ – సుసానే ఖాన్‌ లు 2014లో విడిపోయారు. తమ 14 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ ఇద్దరూ స్వస్తి చెప్పారు. ఆ తర్వాత సుసానే అర్స్లాన్‌ గోనీతో ప్రేమలో పడింది. చాలా కాలంగా ఆమె అతనితో డేటింగ్ లో ఉంది. వీరి పీకల్లోతు ప్రేమ గురించి ఎప్పటికప్పుడు బాలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సుసానే – అర్స్లాన్‌ గోనీ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇక వీరి పెళ్లి చాలా సింపుల్‌ గా జరగబోతుందని తెలుస్తోంది. మరి వీరి వివాహ వేడుక ఎప్పుడు ?, అలాగే వీరి పెళ్లి తేది ఎప్పుడన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోపక్క హృతిక్‌ రోషన్ బాలీవుడ్‌ నటి, సింగర్‌ సబా అజాద్‌తో డేటింగ్‌ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :