హృతిక్ రోషన్ ‘క్రిష్ – 4’ షూటింగ్ అప్ డేట్

Published on May 1, 2023 10:06 pm IST


బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ ప్రస్తుతం సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ఫైటర్ లో నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే విషయం ఏమిటంటే హృతిక్ కెరీర్ లో నటించిన సినిమాల్లో కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 2 ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ అందుకున్నాయి. ఇక అతి త్వరలో తెరకెక్కనున్న క్రిష్ 4 పై హృతిక్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోకూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే, ఈ ఏడాది చివర్లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న వార్ 2 షూటింగ్ లో పాల్గొననున్నారు హృతిక్.

కాగా దీని అనంతరం కరణ్ మల్హోత్రా గ్రాండ్ లెవెల్లో దర్శకత్వం వహించనున్న క్రిష్ 4 షూటింగ్ ని 2024 ద్వితీయార్ధంలో ప్రారంభించనున్నారట హృతిక్. దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్న రాకేష్ రోషన్ మూవీని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు సన్నద్ధం అవుతున్నారట. ప్రస్తుతం సూపర్ హీరో మూవీ క్రిష్ 4 కి సంబందించిన మెయిన్ ప్లాట్ సిద్ధం అయినప్పటికీ, దాని యొక్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా హృతిక్ రోషన్ వరుసగా ఈ మూడు భారీ ప్రాజక్ట్స్ తో బిజీ కానున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :