విక్రమ్ వేద తోలి షెడ్యూల్ ను పూర్తి చేసిన హృతిక్ రోషన్!

Published on Dec 6, 2021 8:22 pm IST

2017 లో విడుదలైన విక్రమ్ వేద చిత్రం ను బాలీవుడ్ లో అదే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం లో నటిస్తూ హృతిక్ రోషన్ బిజిగా ఉన్నారు. 27 రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్ ను తాజాగా ముగించడం జరిగింది. ఈ చిత్రం లో సైఫ్ అలీఖాన్ తో పాటుగా రాధికా అప్టే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఒరిజినల్ మూవీ అయిన విక్రమ్ వేద కి దర్శకత్వం వహించిన పుష్కుర్ మరియు గాయత్రి లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. YNOT స్టూడియోస్ మరియు ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ తో కలిసి టీ సిరీస్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :