హృతిక్ రోషన్ “విక్రమ్ వేద” రెండు రోజుల కలెక్షన్స్ ఇవే!

హృతిక్ రోషన్ “విక్రమ్ వేద” రెండు రోజుల కలెక్షన్స్ ఇవే!

Published on Oct 2, 2022 6:09 PM IST

బాలీవుడ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గీలలో ఒకటైన విక్రమ్ వేద ఇప్పుడు థియేటర్ల లోకి వచ్చింది. హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం విమర్శకుల నుండి చాలా మంచి సమీక్షలను పొందింది. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ లో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. కానీ ఆశ్చర్యకరంగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో వసూళ్లను రాబట్టడం లేదు.

PR ప్రకారం, మొదటి రోజు 10.58 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. కాగా, రెండో రోజు 12.51 కోట్ల రూపాయల వసూలు చేసి రెండు రోజుల మొత్తం 23.09 కోట్ల రూపాయల కి చేరుకుంది. హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీఖాన్ వంటి స్టార్ హీరోలు నటించిన చిత్రానికి ఇది పూర్తిగా ఊహించనిది. మ‌రి ఈరోజు హాలీడే కావ‌డంతో ఈ సినిమా ఎంత వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో చూడాలి. ఒరిజినల్ తమిళ వెర్షన్‌ కి దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రి జంట ఈ హిందీ రీమేక్‌ కి కూడా దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు