“పఠాన్” పై సాలిడ్ రివ్యూ ఇచ్చిన హృతిక్ రోషన్.!

Published on Jan 27, 2023 7:04 am IST

బాలీవుడ్ బాద్షా హీరోగా దీపికా పదుకునే హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “పఠాన్”. బాలీవుడ్ కి నెలకొన్న సంక్షోభం అలాగే షారుఖ్ కి కావాల్సిన అసలైన కం బ్యాక్ కోసం చూస్తున్న తరుణంలో ఈ చిత్రం ఒక సెన్సేషనల్ కం బ్యాక్ లా వచ్చింది.

మరి మొదటి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రంపై సిద్ధార్ట్ ఆనంద్ డైరెక్షన్ లో ఆల్రెడీ రెండు భారీ సినిమాలు బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి చిత్రాల్లో నటించిన స్టార్ హీరో హృతిక్ రోషన్ లేటెస్ట్ గా పఠాన్ పై తన సాలిడ్ రివ్యూ ఇచ్చాడు. కొన్ని ఊహించని సీన్స్, అద్భుతమైన విజువల్స్, ట్విస్ట్ లు, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, సర్ప్రైజ్ లతో సిద్ మళ్లీ నువ్ సాధించావ్ కంగ్రాట్స్ టు షారుఖ్ దీపికా అండ్ ఇతర టీం అంటూ హృతిక్ తన ట్విట్టర్ ద్వారా తన ఎగ్జైట్మెంట్ ని ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :