మేజర్ చిత్రం నుండి “హృదయమా” విడుదలకి సిద్ధం!

Published on Jan 4, 2022 8:07 pm IST

మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత సంఘటనల ఆధారం గా అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం హృదయమా. సోనీ పిక్చర్స్ ఇండియా, జీ.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్, మరియు a+s మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, మేకింగ్ వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు హృదయమా అనే పాటను విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తాజాగా వెల్లడించడం జరిగింది. హృదయమా అనే పాటను జనవరి 7 వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :